s v subbareddy: జగన్ ది ఒక్క క్లిప్పింగ్ చూపించినా.. రాజీనామా చేస్తా: ఎమ్మెల్యే ఎస్వీ మెహన్ రెడ్డి

  • ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తున్నట్టు వైసీపీ నాటకాలు ఆడుతోంది
  • మోదీని జగన్ విమర్శించినట్టు ఒక్క క్లిప్పింగ్ చూపించినా రాజీనామా చేస్తా
  • మోదీ కనుసన్నల్లో జగన్, పవన్ నడుస్తున్నారు
ప్రత్యేక హోదా గురించి పోరాటం చేస్తున్నట్టు వైసీపీ నేతలు నాటకాలు ఆడుతున్నారని కర్నూలు టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. హోదా గురించి ప్రధాని మోదీని వైసీపీ అధినేత జగన్ విమర్శించినట్టు ఒక్క క్లిప్పింగ్ చూపించినా... ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తానని చెప్పారు. దీనిపై తాను అసెంబ్లీలోనే సవాల్ విసిరానని... అయినా, ఇంత వరకు వైసీపీ నేతల నుంచి సమాధానం రాలేదని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ కనుసన్నల్లో జగన్, పవన్ కల్యాణ్ లు నడుస్తున్నారని ఆరోపించారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.
s v subbareddy
Jagan
Pawan Kalyan
Narendra Modi
Special Category Status

More Telugu News