KCR: కేసీఆర్ తో కలసి అసెంబ్లీకి వచ్చిన నటుడు ప్రకాష్ రాజ్!

  • ఫెడరల్ ఫ్రంట్ లో ప్రకాష్ రాజ్ ను భాగస్వామిని చేసే యోచనలో కేసీఆర్
  • మధ్యాహ్నం కేసీఆర్ తో కలసి భోజనం చేయనున్న ప్రకాష్
  • ఇటీవలి కాలంలో మోదీపై విమర్శలు గుప్పిస్తున్న ప్రకాష్
ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలసి అసెంబ్లీకి వచ్చారు. వీరి కలయిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీ వెనుక రాజకీయ కోణం ఉందని భావిస్తున్నారు. కేసీఆర్ తెరపైకి తెచ్చిన ఫెడరల్ ఫ్రంట్ పై ప్రకాష్ రాజ్ చర్చించనున్నట్టు సమాచారం.

ఫెడరల్ ఫ్రంట్ లో ప్రకాష్ రాజ్ ను కూడా భాగస్వామిని చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నారని... అందుకే ఆయనను భేటీకి ఆహ్వానించారని తెలుస్తోంది. మధ్యాహ్నం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రితో కలసి ప్రకాష్ భోజనం చేయనున్నారు. మరోవైపు బెంగళూరులో గౌరీ లంకేష్ హత్య జరిగినప్పటి నుంచి ప్రధాని మోదీపైన, బీజేపీ నేతలపైనా ప్రకాష్ రాజ్ విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. 
KCR
Prakash Raj
federal front
meeting

More Telugu News