suxual harrassment: కోడలిపై లైంగిక వేధింపులు.. మామకు జైలు శిక్ష

  • ప్రేమ వివాహం చేసుకున్న కుమారుడు
  • మందుతాగి కోడలిని వేధిస్తున్న మామ
  • నాలుగేళ్ల జైలు శిక్ష

కోడలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో మామకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళ్తే, తమిళనాడులోని అంబూరు ప్రాంతానికి చెందిన పన్నీర్ సెల్వం (59) కుమారుడు శివ 2009లో ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, పన్నీర్ సెల్వం నిత్యం మందు తాగి వచ్చి, కోడలిని లైంగిక వేధింపులకు గురి చేసేవాడు. ఆయనకు నచ్చజెప్పేందుకు బాధితురాలు ఎంతో ప్రయత్నించినప్పటికీ, ఫలితం దక్కలేదు.

దీంతో విసుగు చెందిన ఆమె... అంబూరు మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు, పన్నీర్ సెల్వంను అరెస్ట్ చేశారు. వేలూరు మహిళా కోర్టులో ఈ కేసు నిన్న విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో కన్నకూతురిలా చూసుకోవాల్సిన కోడలిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు నాలుగేళ్ల జైలు శిక్ష, మహిళల వేధింపు చట్టం కింద మరో ఏడాది జైలు శిక్షను ఏకకాలంలో అనుభవించడంతో పాటు... రూ. 12 వేల జరిమానా విధిస్తున్నట్టు జడ్జి తీర్పును వెలువరించారు.

More Telugu News