ramgopal verma: నా తరువాతి సినిమా హీరోయిన్ తనే... అడిగిన దానికంటే పది లక్షలు ఎక్కువిస్తా!: రాంగోపాల్ వర్మ

  • ‘టగరు’ సినిమాను చిత్రయూనిట్ తో కలిసి చూసిన రాంగోపాల్ వర్మ
  • ఈ సినిమా హీరోయిన్ మాన్విత హరీశ్ ను పొగడ్తల్లో ముంచెత్తిన వర్మ
  • ఈ సినిమా దర్శకుడుతో కొత్త ప్రాజక్టు ప్రకటించిన వర్మ
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తన తదుపరి సినిమా కాస్టింగ్ ను ప్రకటిస్తూ ఆసక్తి రేపుతున్నాడు. ఇప్పటికే అఖిల్ తో సినిమాను ప్రకటించిన వర్మ, తన తరువాతి సినిమా హీరోయిన్ ను కూడా ప్రకటించాడు. ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో రూపొందిన ‘టగరు’ సినిమాను చిత్రయూనిట్ తో కలిసి వర్మ చూశాడు.

ఈ సినిమా చూసిన తరువాత వర్మ మాట్లాడుతూ, ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పోషించిన మాన్విత హరీశ్‌ కేవలం కథానాయిక మాత్రమే కాదని అన్నాడు. ఈ సినిమాలో ఆమె తన నటనతో అందరినీ విస్మయానికి గురి చేస్తుందని చెప్పాడు. ఆమెను తన తదుపరి సినిమాకు హీరోయిన్ గా ఎంచుకుంటున్నానని చెప్పాడు. ఆ సినిమాకు ఆమె అడిగిన పారితోషికం కంటే 10 లక్షల రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పాడు. ఈ సినిమా దర్శకుడు సూరితో ఒక సినిమా నిర్మిస్తానని చెప్పాడు. 
ramgopal verma
tagaru movie
kannada
manvita harish

More Telugu News