fake currency: నకిలీ నోట్ల చలామణిలో నరేంద్ర మోదీ రాష్ట్రమే ఫస్ట్!

  • నకిలీ కరెన్సీ చలామణిలో గుజరాత్ ఫస్ట్
  • రెండో స్థానంలో మిజోరాం
  • గుజరాత్ లోని పెద్ద నగరాల్లో నకిలీ నోట్ల ప్రింటింగ్

దేశ ఆర్థిక వ్యవస్థను నకిలీ కరెన్సీ ఛిన్నాభిన్నం చేస్తోంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో నకిలీ నోట్లు చలామణి అవుతున్నాయి. నకిలీ కరెన్సీ చలామణిలో ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ తొలి స్థానంలో ఉంది. రూ. 500, రూ. 2000 నకిలీ నోట్ల చలామణిలో గుజరాత్ అగ్ర స్థానంలో ఉందని జాతీయ నేర రికార్డుల బ్యూరో వెల్లడించింది.

2017 జనవరి నుంచి 2018 ఫిబ్రవరి వరకు దేశవ్యాప్తంగా రూ. 6.77 కోట్ల నకిలీ కరెన్సీని పోలీసులు సీజ్ చేశారు. ఇందులో 34 శాతం అంటే రూ. 2.31 కోట్ల నకిలీ నోట్లను గుజరాత్ లోనే స్వాధీనం చేసుకున్నారు. రూ. 1.23 కోట్ల సీజ్ తో మిజోరాం రెండో స్థానంలో ఉంది. గుజరాత్ లోని పెద్ద నగరాల్లో నకిలీ నోట్లను ముద్రిస్తున్నారని... అక్కడ నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాలకు సరఫరా చేస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది.  

More Telugu News