david warner: స్మిత్, వార్నర్ కు మరో శిక్ష... ఐపీఎల్ నుంచి బహిష్కరణ

  • స్మిత్, వార్నర్ కు శిక్ష ఖరారు చేసిన బీసీసీఐ
  • ఐపీఎల్ నుంచి బహిష్కరణ
  • శిక్ష వివరాలను ప్రకటించిన రాజీవ్ శుక్లా
బాల్‌ ట్యాంపరింగ్ కుంభకోణంలో ఐసీసీ, సీఏ ఏడాది నిషేధం శిక్షకు గురైన స్టీవ్ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ పై మరో శిక్ష పడింది. ఐపీఎల్‌ నుంచి వారిద్దరినీ బహిష్కరిస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్ లో రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ స్మిత్‌, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్ వార్నర్‌ లపై ఐసీసీ, సీఏ చర్యల కోసం వేచి చూశామని బీసీసీఐ తెలిపింది. ఆ తరువాత వారిద్దరినీ తక్షణమే ఐపీఎల్ నుంచి నిషేధిస్తున్నామని ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా తెలిపారు. స్మిత్ స్థానంలో రహానే కెప్టెన్ బాధ్యతలు స్వీకరించగా, వార్నర్ స్థానంలో ధావన్ పగ్గాలు చేపట్టనున్నాడని తెలుస్తోంది.
david warner
stive smith
Cricket
ipl

More Telugu News