chandranna village mall: చంద్రన్న విలేజ్ లో అమెరికాకు చెందిన రీసెర్చ్ స్కాలర్స్ సందడి!

  • నగదు రహిత లావాదేవీలపై అధ్యయనం చేస్తున్న స్కాలర్స్
  • జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటన
  • ఈ పాస్, ఐరిష్ ద్వారా చెల్లింపులు జరపుతుండటం హర్షనీయం
విజయవాడలోని విద్యాధరపురంలో చెరువు సెంటర్ లో ఉన్న చంద్రన్న విలేజ్ మాల్ ను అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ గ్లోబల్ రీసెర్చ్ స్కాలర్స్ బృందం నిన్న సందర్శించింది. నగదు రహిత లావాదేవీలపై చేస్తున్న అధ్యయనంలో భాగంగా గత మూడు రోజులుగా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఈ టీమ్ పర్యటిస్తోంది. చంద్రన్న మాల్ ను సందర్శించిన సందర్భంగా బృంద సభ్యుడు ఎలీన్ క్లబ్ మాట్లాడుతూ, తమ దేశంలో నగదు రహిత లావాదేవీలను డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా మాత్రమే నిర్వహిస్తామని చెప్పారు. ఏపీ విలేజ్ మాల్స్ లో కొనుగోలు చేస్తున్న వినియోగాదారుడి ఖాతా నుంచి ఈ పాస్, ఐరిష్ ద్వారా చెల్లింపులు జరపడం హర్షణీయమని చెప్పారు.
chandranna village mall
center for global research scholors

More Telugu News