parineeti chopra: ప్రజలు మమ్మల్ని ఎప్పుడూ అపార్థం చేసుకుంటారు: పరిణతి చోప్రా

  • సినీ పరిశ్రమపై ప్రజల్లో ఎన్నో అపోహలు 
  • సినీ నటులను అపార్థం చేసుకుంటున్నారు 
  • సినిమా వారే అర్థం చేసుకోగలుగుతారు 
సినీ పరిశ్రమలోని వారిని ప్రజలు ఎప్పుడూ అపార్థం చేసుకుంటారని బాలీవుడ్ నటి పరిణతి చోప్రా తెలిపింది. సినీ పరిశ్రమపై ప్రజల్లో ఉన్న అపోహల గురించి మాట్లాడుతూ, సినీ నటులెప్పుడూ తమ కోపాన్ని ప్రదర్శిస్తారని, విపరీతమైన యాటిట్యూడ్ చూపిస్తుంటారని, అందుకే వారిని హ్యాండిల్ చెయ్యడం కష్టమని చాలామంది అపోహ పడుతుంటారని పేర్కొంది. వాస్తవానికి సినీ నటులు చాలా మంచివాళ్లని చెప్పింది.

సినీ నటులు పబ్లిక్‌ లో కనిపించిన ప్రతిసారి చాలా కళ్లు తీక్షణంగా గమనిస్తుంటాయని, దాంతోనే తాము  చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందని తెలిపింది. అలాగే తమ గురించి చాలా తొందరగా నిర్ణయానికి వచ్చేస్తారని చెప్పింది. అలాంటివి జరగకుండా ఉంటే బాగుంటుందని అనుకుంటానని చెప్పింది. సినిమాల్లో నటించేవారు తప్ప తమ సమస్యలు వేరెవరూ అర్థం చేసుకోలేరని చెప్పింది. కామన్‌ పీపుల్‌ తో పోలిస్తే తమది చాలా డిమాండింగ్‌ లైఫ్‌ అని పరిణతి తెలిపింది. 
parineeti chopra
Bollywood
actress

More Telugu News