artist anasuya: ‘రంగమ్మత్త’ గెటప్ లో నేను దిగిన తొలి సెల్ఫీ ఇది!: యాంకర్ అనసూయ

  • ‘రంగమ్మత్త’ తొలి సెల్ఫీని మీతో పంచుకుంటున్నా
  • మరో రెండు రోజుల్లో ‘రంగమ్మత్త’ను థియేటర్లలో కలవండి
  • ఓ ట్వీట్ చేసిన నటి అనసూయ

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందిన చిత్రం ‘రంగస్థలం’. ఈ చిత్రంలో రంగమ్మత్త పాత్రను పోషించిన నటి, యాంకర్ అనసూయ తాజాగా ఓ ఫొటో పోస్ట్ చేసింది. ‘తొలిసారి ‘రంగమ్మత్త’ గెటప్ లో దిగిన తొలి సెల్ఫీని మీతో పంచుకుంటున్నా..మరో రెండు రోజుల్లో రంగమ్మత్తను థియేటర్లలో కలవండి!!’ అని తన ట్వీట్ లో పేర్కొంది.

కాగా, ఈ నెల 30న ‘రంగస్థలం’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్ సరసన సమంత నటించిన ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, ఆది పినిశెట్టి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

More Telugu News