Tollywood: ఆ ‘తియ్యటి బాధ’ ఈరోజే నాకు తెలిసింది : హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్

  • జిమ్ లో వెయిట్ లిఫ్ట్ చేసిన రకుల్ ప్రీత్
  • చాలా కొద్ది మందికి మాత్రమే ‘తియ్యటి బాధ’కు అర్థం తెలుస్తుంది
  • ఓ వీడియో పోస్ట్ చేసిన హీరోయిన్ రకుల్ ప్రీత్

ఫిట్ నెస్ పట్ల ఎంతో శ్రద్ధ కనబరిచే ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్  వెయిల్ లిఫ్ట్ చేసింది. జిమ్ లో ట్రైనర్ సమక్షంలో వెయిట్ లిఫ్ట్ చేసిన రకుల్ ఈ సందర్భంగా ఓ వీడియో పోస్ట్ చేసింది. ‘చాలా కొద్ది మందికి మాత్రమే తియ్యటి బాధ అనే పదానికి అర్థం తెలుస్తుంది!! ఆ తియ్యటి బాధేంటో ఈరోజున నాకు తెలిసింది’ అని పేర్కొంది. ఈ పోస్ట్ పై నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వచ్చాయి. ‘నన్ను మీరెంతో ఉత్సాహపరిచారు’, ‘అద్భుతం’, ‘స్వీట్ పెయిన్ ఫర్ స్వీట్ పర్పజ్’, ‘టోటల్లీ రాంగ్’ అంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

More Telugu News