Viral Videos: చెన్నైలో దారుణం.. పోలీసుని వెంబడించి చితక్కొట్టిన యువకులు.. సీసీ కెమెరాలో రికార్డు

  • పోలీస్ కానిస్టేబుల్‌కి గాయాలు
  • ఆసుపత్రిలో చికిత్స
  • దుండగుల కోసం గాలింపు

చెన్నైలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విధులు నిర్వర్తిస్తోన్న ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ని కొందరు యువకులు వెంబడించి చావగొట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే, చెన్నైలోని కట్టుపక్కం ప్రాంతంలో ఓ పోలీసును తరుముతూ కొందరు యువకులు వచ్చారు. చివరికి ఆ పోలీసుని పట్టుకుని పదునైన ఆయుధంతో కొట్టారు. అనంతరం వారి నుంచి తప్పించుకుని పారిపోతోన్న ఆ పోలీసును మళ్లీ వెంబడించి పట్టుకుని పిడిగుద్దులు కురిపించారు.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాకు చిక్కాయి. ప్రస్తుతం ఆ పోలీసు కానిస్టేబుల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గుర్తు తెలియని ఆ దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ దుండగులు ఈ దాడి ఎందుకు చేశారన్న విషయం గురించి సమాచారం అందాల్సి ఉంది.           

More Telugu News