Chandrababu: సంస్కారం లేని వ్యక్తి విజయసాయిరెడ్డి!: మంత్రి పరిటాల సునీత

  • చంద్రబాబు పేరెత్తే అర్హత కూడా ఆయనకు లేదు
  • కేసుల మాఫీ కోసమే ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకున్నారు
  • నా లాంటి వారి పసుపు, కుంకుమలు తుడిచేసిన నేతలు వాళ్లు

సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా, మంత్రి పరిటాల సునీత స్పందిస్తూ, సంస్కారం లేని వ్యక్తి విజయసాయిరెడ్డి అని, చంద్రబాబు పేరెత్తే అర్హత కూడా ఆయనకు లేదని విమర్శించారు.

ఈ సందర్భంగా తన భర్త పరిటాల రవీంద్ర గురించి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా ఆమె స్పందించారు. తన లాంటి ఎంతో మంది పసుపు, కుంకుమలు తుడిచేసిన నేతలు మీరంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి కేసుల మాఫీ కోసమే ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకున్నారంటూ విజయసాయిరెడ్డిపై ఆమె మండిపడ్డారు.

  • Loading...

More Telugu News