savitribai pule: మోదీ ప్రభుత్వంపై సొంత ఎంపీ తిరుగుబాటు!

  • రిజర్వేషన్లను ఎత్తి వేసే కుట్ర జరుగుతోందన్న సావిత్రిబాయి
  • కుట్రను ఎదుర్కోవడానికి ఎంత దూరమైనా వెళ్తానన్న ఎంపీ
  • రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీలో కొందరు గళమెత్తుతున్నారు
యూపీకి చెందిన బీజేపీ దళిత ఎంపీ సావిత్రిబాయి పూలె సొంత పార్టీపైనే తిరుగుబాటు చేశారు. మోదీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని... బడుగు, బలహీనవర్గాలకు ప్రస్తుతం అందిస్తున్న రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తోందని ఆమె ఆరోపించారు. ఈ కుట్రకు వ్యతిరేకంగా... ఏప్రిల్ 1వ తేదీన లక్నోలో తాను ర్యాలీ నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు.

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీలో కొందరు గళమెత్తుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై బీజేపీ చర్యలు తీసుకుంటే... అది రాజ్యాంగ స్ఫూర్తిగా వ్యవహరించినట్టేనని అన్నారు. రిజర్వేషన్లను కాపాడుకునేందుకు ఇప్పటికే తాను బహ్రైచ్ లోని నాస్ పరాలో ర్యాలీ నిర్వహించానని సావిత్రిబాయి తెలిపారు. రిజర్వేషన్లను ఎత్తివేసే ప్రయత్నాన్ని తాను తీవ్రంగా అడ్డుకుంటానని... తన పోరాటంలో భాగంగా ఎంత దూరం వెళ్లేందుకైనా సిద్ధమేనని చెప్పారు.
savitribai pule
reservation
protest
NDA
Narendra Modi

More Telugu News