kcr: తెలంగాణలో టీడీపీని నిర్వీర్యం చేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు!: సండ్ర వీరయ్య

  • టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ని గుర్తు చేసుకున్న సండ్ర 
  • దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ దే! 
  • బడుగులకు న్యాయం జరగాలంటే టీడీపీ అధికారంలోకి రావాలి
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుని టీటీడీపీ నేత సండ్ర వెంకట వీరయ్య గుర్తుచేసుకున్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ,1982 మార్చి 29న టీడీపీని స్థాపించిన విషయాన్ని గుర్తుచేసుకున్న ఆయన, తెలంగాణ ప్రాంతంలోనే ఎన్టీఆర్ ఆత్మ తిరుగుతోందని అన్నారు. ఎన్టీఆర్ చేసిన సేవలను ఆయన ప్రశంసించారు.

టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ నుంచి ప్రారంభం కానున్నట్టు చెప్పారు. దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ దేనని కొనియాడారు. తెలంగాణలో బడుగు వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసేందుకే కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో టీడీపీ బలహీనపడితే బడుగు వర్గాల ప్రజలకు న్యాయం జరగదని అన్నారు.
kcr
sandra venkata veeraiah

More Telugu News