cuddapah: కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రానికి అందిన టాస్క్ ఫోర్స్ నివేదిక

  • కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి అందిన టాస్క్ ఫోర్స్ నివేదిక
  • ఈ నివేదికపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి బీరేంద్ర సింగ్
  • ఏపీ ప్రభుత్వంతో చర్చిస్తామన్న కేంద్ర మంత్రి

కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి టాస్క్ ఫోర్స్ నివేదిక అందింది. ఈ నివేదికను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ కు టాస్క్ ఫోర్స్ అధికారులు అందించారు. ఈ నివేదికపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తుందనే విషయమై ఏపీ ప్రభుత్వంతో చర్చిస్తామని టాస్క్ ఫోర్స్ అధికారులతో బీరేంద్ర సింగ్ చెప్పారు.

ఫ్యాక్టరీ నిర్మాణానికి అవసరమైన భూమి, విద్యుత్ , రవాణ సదుపాయాలు తదితర అంశాలపై బీరేంద్ర సింగ్ చర్చించనున్నారు. కాగా, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని రాయలసీమలోని అన్ని పక్షాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదనే విమర్శలు తలెత్తిన నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ నివేదిక సానుకూలంగా ఉండటం గమనార్హం. స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి విభజన చట్టంలోనూ స్పష్టమైన హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

More Telugu News