ntr: ఎన్టీఆర్ ఎంతగానో ఆదరించారు .. ఆయనని చూడటానికి బస్సులకొద్దీ జనం వచ్చేవారు: సీనియర్ నటి గీతాంజలి
- కాకినాడ నుంచి చెన్నై కి వెళ్లాము
- అక్కడ మాకు ఎవరూ తెలియదు
- ఎన్టీఆర్ గారు జాగ్రత్తగా చూసుకునేవారు
సీనియర్ నటి గీతాంజలి తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "మేము కాకినాడ నుంచి వచ్చాం .. చెన్నైలో ఎవరూ తెలియదు. మా మంచితనాన్ని గ్రహించిన ఎన్టీఆర్ గారు .. మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. ఆయనకి ఇష్టమైన చికెన్ .. పులిహోర .. పొంగలి మా అమ్మగారు చేసి పంపించేవారు.
ఉదయం పూట ఆయన టిఫిన్ చేయరు .. 8 గంటలకల్లా డైరెక్టుగా భోజనమే చేసేసే వారు. అందువలన ఉదయం 8 గంటలకల్లా అప్పుడప్పుడు మా ఇంటి నుంచి ఆయనకి ఇష్టమైనవి వెళుతూ ఉండేవి. ఉదయం ఆయన భోజనం చేసి షూటింగుకి బయల్దేరే సమయానికి, ఆయన ఇంటి గేటు దగ్గర ఓ పది బస్సుల జనం ఉండేవారు. వాళ్లంతా తిరుపతి వెళ్లే వాళ్లు .. ఎన్టీఆర్ ను చూసిన తరువాతనే అక్కడి నుంచి బయల్దేరేవాళ్లు. వాళ్లందరినీ ఆప్యాయంగా పలకరించి ఆయన స్టూడియోకి వెళ్లేవారు" అంటూ చెప్పుకొచ్చారు.