Vijay Sai Reddy: వైసీపీ పగలు సంసారం, రాత్రి రాజకీయ వ్యభిచారం చేస్తోంది: ధూళిపాళ్ల నరేంద్ర

  • విజయసాయిరెడ్డి చీటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు
  • రాజ్యసభకు మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారు
  • మోదీ కాళ్లకు మొక్కడం ద్వారా అసలు నైజాన్ని చాటుకున్నారు
వైసీపీపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పగలు సంసారం చేస్తూ, రాత్రి రాజకీయ వ్యభిచారం చేయడం ఆ పార్టీ నేతల నైజమని ఆయన విమర్శించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చీటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విజయసాయి... ఆ సభకు మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సంస్కార హీనంగా మాట్లాడుతూ, రాజ్యసభ గౌరవాన్ని దిగజార్చుతున్నారని అన్నారు. ప్రధాని కాళ్లకు మొక్కడం ద్వారా ఆయన తన అసలు నైజాన్ని చాటుకున్నారని ఎద్దేవా చేశారు.
Vijay Sai Reddy
dhulipalla narendra
Narendra Modi

More Telugu News