bahubali: కరాచీ ఫిలిం ఫెస్టివల్ కు ఆహ్వానం.. థ్యాంక్స్ చెప్పిన రాజమౌళి

  • అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కు రాజమౌళిని ఆహ్వానించిన పాకిస్థాన్
  • ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపిన రాజమౌళి
  • అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో 'బాహుబలి' ప్రదర్శన 

పాకిస్థాన్, కరాచీలకు ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి ధన్యవాదాలు తెలిపారు. 'బాహుబలి' సినిమాతో అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించుకున్న రాజమౌళిని కరాచీలో జరగనున్న అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కి పాకిస్థాన్ ఆహ్వానించింది. దీనిపై రాజమౌళి ట్విట్టర్ లో స్పందించాడు.

‘బాహుబలి’ సినిమా వివిధ దేశాల్లో పర్యటించే అవకాశం కల్పించింది. వాటన్నింటిలో ఇప్పుడు వచ్చిన ఆహ్వానం నాకు మరింత ఆనందాన్నిచ్చింది. నన్ను అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌ కు ఆహ్వానించినందుకు గానూ పాకిస్థాన్‌, కరాచీలకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్‌ చేశాడు. ‘బాహుబలి’, ‘డియర్‌ జిందగీ’, ‘జాలీ ఎల్‌ఎల్‌బీ 2’, ‘హిందీ మీడియం’, ‘సైరాట్‌’, ‘నీల్‌ బత్తే సన్నాటా’ సినిమాలను ప్రదర్శించనున్నారు.

More Telugu News