air vistara: క్యాబిన్ క్రూ ఉద్యోగినిపై వృద్ధ ప్రయాణికుడి లైంగిక వేధింపులు... అరెస్ట్

  • ఈ నెల 24న జరిగిన ఘటన
  • లక్నో నుంచి ఢిల్లీకి చేరిన తర్వాత విమానంలో వేధింపులు
  • ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు, ప్రయాణికుడి అరెస్ట్

ఓ వృద్దుడు విమానంలో మహిళా క్యాబిన్ క్రూ ఉద్యోగిని పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. ఎయిర్ విస్తారా విమానం లక్నో నుంచి ఢిల్లీకి వెళుతుండగా ఈ నెల 24న ఈ ఘటన జరిగింది. విమానం ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత 62 ఏళ్ల వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి సంబంధిత వ్యక్తిని అరెస్ట్ చేశారు.

దీనిపై ఎయిర్ విస్తారా ఓ ప్రకటన విడుదల చేసింది. అసభ్యకర, వికృత చేష్టలకు పాల్పడే ప్రయాణికులను ఉపేక్షించేది లేదని గట్టిగా హెచ్చరించింది. ఈ రకమైన ప్రవర్తన తమ సిబ్బంది భద్రత, తోటి ప్రయాణికులకు రిస్క్ అని, వారి గౌరవం విషయంలో రాజీ పడేది లేదంటూ ఎయిర్ విస్తారా స్పష్టం చేసింది.

More Telugu News