geetanjali: నా డైలాగ్స్ విషయంలో ఎన్టీఆర్ అంత శ్రద్ధ తీసుకున్నారు: సీనియర్ నటి గీతాంజలి

  • నా తొలి సినిమా 'సీతారామ కల్యాణం'
  • సీత పాత్రను పోషించాను 
  • ఎన్టీఆర్ ఇంట్లో డైలాగ్స్ నేర్చుకున్నాను

సావిత్రి .. వాణిశ్రీ .. శారద .. కాంచన కథానాయికలుగా ఒక వెలుగు వెలుగుతోన్న కాలంలో, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు గీతాంజలి. అప్పట్లోనే మోడ్రన్ గా కనిపించి తెరపై తెగ అల్లరి చేసేసిన హీరోయిన్ ఆమె. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ మూవీస్ లో నటించిన గీతాంజలి, తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ అనేక విషయాలను ముచ్చటించారు.

" 'సీతారామ కల్యాణం' నా మొదటి సినిమా .. ఈ సినిమాలో నేను సీత పాత్రను పోషించాను. రావణుడిగా ఎన్టీఆర్ .. మండోదరిగా బి.సరోజాదేవిగారు నటించారు. నాకు ఇదే మొదటి సినిమా కావడంతో .. నా డైలాగ్స్ విషయంలో ఎన్టీఆర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. డైలాగ్స్ ఎలా చెప్పాలనే విషయంలో నిర్మాత పుండరీ కాక్షయ్య కజిన్ శిక్షణ ఇచ్చారు. ప్రతిరోజు రెండు గంటల పాటు రామారావు గారి ఇంట్లోనే నేను డైలాగ్స్  నేర్చుకోవడం జరిగేది. తొలి సినిమాలోనే ఒక మరిచిపోలేని పాత్రను చేసినందుకు ఇప్పటికీ సంతోష పడుతుంటాను .. గర్వపడుతుంటాను" అన్నారు.       

More Telugu News