ram gopal verma: అఖిల్ తో రాంగోపాల్ వర్మ సినిమా... నిర్మాత నాగార్జున

  • అఖిల్ నాలుగో సినిమా రాంగోపాల్ వర్మతో
  • ఫేస్ బుక్ లో పోస్టు పెట్టి ఆశ్చర్యపరిచిన వర్మ
  • యాక్షన్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తానంటూ వివరణ

అక్కినేని వారసుడు అఖిల్ తన మూడో సినిమాను ఈ మధ్యే లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన నాలుగో సినిమాను కూడా లైన్లో పెట్టేశాడు. ఈ సినిమాను నాగార్జున నిర్మిస్తుండగా, రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. రాంగోపాల్ వర్మ ప్రస్తుతం నాగార్జునతో 'ఆఫీసర్' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా మే 25న రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలో వర్మ చెబుతూ... తనను దర్శకుడిగా పెట్టి నాగార్జున మరో సినిమాను నిర్మించనున్నాడని, అందులో అఖిల్ హీరోగా నటిస్తాడని ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడు. ఈ సినిమాను యాక్షన్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నట్టు తెలిపాడు. 

More Telugu News