cambridge analytica: కాంగ్రెస్ పార్టీతో మాకు సంబంధం లేదు: కేంబ్రిడ్జ్ ఎనలిటికా

  • భారత్ పై వైలీ చేసిన ఆరోపణలన్నీ ఊహాగానాలే
  • 2014లోనే సంస్థ నుంచి వైలీ వైదొలిగాడు
  • అతనికి కంపెనీ పాలసీ తెలియదు
కాంగ్రెస్ పార్టీకి సేవలందించిందన్న ప్రచారాన్ని బ్రిటన్‌ కంపెనీ కేంబ్రిడ్జ్‌ ఎనలిటికా ఖండించింది. భారత్‌ లో సేవలపై ఆ కంపెనీ మాజీ ఉద్యోగి క్రిస్టోఫర్‌ వైలీ చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది. పార్ట్‌ టైమ్‌ కాంట్రాక్టర్‌ గా పనిచేసిన వైలీ 2014, జులైలోనే సంస్థ నుంచి వైదొలిగారని కేంబ్రిడ్జ్ ఎనలిటికా తెలిపింది. అప్పటినుంచి కంపెనీ కార్యకలాపాలు, పద్ధతుల గురించి వైలీకి తెలియదని ప్రకటన జారీ చేసింది. బ్రిటన్‌ పార్లమెంటరీ కమిటీ ఎదుట ఆయన చెప్పినవన్నీ కేవలం ఊహాగానాలేనని కేం‍బ్రిడ్జ్‌ ఎనలిటికా స్పష్టం చేసింది.

కాగా, ఈ సంస్థపై ఫేస్‌ బుక్‌ డేటాను సంగ్రహించి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిందని ఆరోపణలున్న సంగతి తెలిసిందే. బ్రిటన్ పార్లమెంట్ కి వైలీ నివేదిక ఇస్తూ, భారత్‌ లో కేంబ్రిడ్జ్‌ ఎనలిటికా విస్తృతంగా కార్యకలాపాలు సాగించిందని, అక్కడ సంస్థకు కార్యాలయం ఉందని, సిబ్బంది కూడా ఉన్నారని, కాంగ్రెస్‌ పార్టీ కేంబ్రిడ్జ్‌ ఎనలిటికాకు క్లైంట్‌ అని సమాచారం ఉందని పేర్కొన్నట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. 
cambridge analytica
Congress party
christopar waily

More Telugu News