Sasikala: కర్ణాటక లేడీ సూపర్ పోలీస్ రూప చుట్టూ మరో వివాదం... అవార్డే ప్రకటించలేదంటున్న బెంగళూరు ఫౌండేషన్

  • శశికళ రాజభోగాలను వెలుగులోకి తెచ్చిన రూప
  • నమ్మ బెంగళూరు అవార్డును తిరస్కరించినట్టు వార్తలు
  • ఖండించిన ఫౌండేషన్
బెంగళూరు శివార్లలోని పరప్పన అగ్రహార జైల్లో అన్నాడీఎంకే నేత శశికళ రాజభోగాలు అనుభవిస్తున్నారంటూ సాక్ష్యాలతో సహా నిరూపించి, దేశవ్యాప్తంగా లేడీ సూపర్ పోలీస్ గా గుర్తింపు తెచ్చుకున్న రూప ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. తనకు ప్రతిష్ఠాత్మకమైన 'నమ్మ బెంగళూరు ఫౌండేషన్' అవార్డు వచ్చిందని, పారితోషికంగా ఇచ్చే రూ. 2 కోట్లను తీసుకోవడం ఇష్టం లేక దాన్ని కాదన్నానని ఆమె ప్రకటించిన నేపథ్యంలో ఫౌండేషన్ ప్రతినిధులు స్పందించారు.

రూపకు తాము ఎటువంటి అవార్డునూ ప్రకటించలేదని, కేవలం అవార్డు పరిశీలనకు ఉన్న పేర్లలో మాత్రమే రూపను చేర్చామని, తుది విజేతను తామింకా ప్రకటించలేదని స్పష్టం చేసింది. అవార్డును ప్రకటించకుండానే, తాము ఇచ్చినట్టు, ఆమె తిరస్కరించినట్టు చెప్పుకోవడం ఏంటని ఫౌండేషన్ ప్రతినిధులు ప్రశ్నించారు. కాగా, రూప తన స్వహస్తాలతో ఓ లేఖ రాస్తూ, అవార్డును తిరస్కరిస్తున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ తరహా అవార్డులను ప్రభుత్వ అధికారులకు ఇవ్వరాదని కూడా అభిప్రాయపడ్డారు.
Sasikala
Bengalore
D Roopa
Namma Bengalore Foundation

More Telugu News