Cricket: కోహ్లీకి ఆ అవకాశం ఇవ్వొద్దు: బాబ్ విల్లీస్

  • కోహ్లీకి కౌంటీల్లో ఆడే అవకాశం ఇవ్వొద్దు
  • ఆటకు పదునుపెట్టుకునే అవకాశం ఇవ్వడం తెలివితక్కువ తనం
  • కోహ్లీ కంటే యువకులకు అవకాశాలివ్వడం మంచిది

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇంగ్లండ్‌ తో టెస్టు సిరీస్‌ కు ముందు కౌంటీల్లో ఆడే అవకాశం కల్పించవద్దని ఆ దేశ మాజీ పేసర్ బాబ్ విల్లీస్ ఈసీబీ (ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు)కి సూచించాడు. కోహ్లీకి కౌంటీల్లో ఆడే అవకాశం ఇస్తే ఇంగ్లండ్‌ సొంతగడ్డపై మరో ఓటమికి సిద్ధమైనట్లేనని వ్యాఖ్యానించాడు.

గత టెస్టు సిరీస్‌ లాగే ఈసారి కూడా కోహ్లీ బాగా ఇబ్బంది పడాలని కోరుకుంటున్నానని అన్నాడు. విదేశీ ఆటగాళ్లందరికీ మన కౌంటీల్లో ఆడే అవకాశం కల్పించడం ద్వారా ఇంగ్లండ్ లో వారు రాణించే వీలు కల్పిస్తున్నామని ఆయన ఈసీబీని హెచ్చరించాడు. ఇంగ్లండ్ తో సిరీస్ కు ముందు కోహ్లీకి భారీ మొత్తాన్ని ఇస్తూ, ఆటకు పదునుపెట్టుకునే అవకాశం ఇవ్వడం అంత తెలివితక్కువ పని ఇంకోటి లేదని ఆయన స్పష్టం చేశాడు. కౌంటీల్లో కోహ్లీకి ఆడే అవకాశం కల్పించడం కంటే, స్వదేశంలోని యువ ఆటగాళ్లకు ఆ అవకాశం కల్పిస్తే మెరికల్లాంటి ఆటగాళ్లు తయారవుతారని బాబ్ విల్లీస్ సూచించాడు.

More Telugu News