Khammam: నగదు లేని ఏటీఎంకు కర్మకాండ.. ఖమ్మంలో వినూత్న నిరసన

  • నోట్ల రద్దుతో జనాల ఇబ్బందులు
  • బ్యాంకుల తీరుకు నిరసనగా డీవైఎఫ్ఐ నాయకుల ప్రదర్శన
  • కర్మకాండలను ఆసక్తిగా గమనించిన ప్రజలు

నోట్ల రద్దు తర్వాత దిష్టిబొమ్మల్లా మారిన ఏటీఎంలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ‘నో క్యాష్’ బోర్డులు వేలాడదీసుకుని ప్రజలను వెక్కిరిస్తున్నాయి. అవసరానికి పనికి రాని ఏటీఎంలు ఎందుకంటూ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా బ్యాంకులు మాత్రం స్పందించడం లేదు. అరకొరగా డబ్బు నింపి మమ అనిపించేస్తున్నారు.

 ఈ నేపథ్యంలో ఖమ్మంలో డీవైఎఫ్ఐ నాయకులు వినూత్న ప్రదర్శన నిర్వహించారు. నగదు లేని ఏటీఎంలు తమకొద్దంటూ నినదించారు. అనంతరం డిపో రోడ్డులోని ఓ ఏటీఎంకు కర్మకాండలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమం అనంతరం నాయకులు మాట్లాడుతూ నగదు కొరత సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చేతిలో చిల్లగవ్వ లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే బ్యాంకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నాయని ఆరోపించారు.

More Telugu News