Vijay Sai Reddy: విజయసాయిరెడ్డిపై విరుచుకుపడ్డ నారా లోకేష్

  • కేసుల నుంచి బయటపడేందుకు తాపత్రయపడుతున్నారు
  • ప్రధాని పక్కన ఏ2 ముద్దాయి తిరగడం మంచిది కాదు
  • చంద్రబాబును విమర్శించే అర్హత విజయసాయికి లేదు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మంత్రి నారా లోకేష్ విరుచుకుపడ్డారు. కేసుల నుంచి బయటపడటానికి విజయసాయిరెడ్డి తాపత్రయపడుతున్నారని ఎద్దేవా చేశారు. పార్లమెంటులో ప్రధాని మోదీ కాళ్లు పట్టుకున్నది ఎవరో? ఇదే సమయంలో మోదీని నిలదీస్తున్నది ఎవరో? ప్రజలకు పూర్తిగా తెలుసని చెప్పారు. ప్రధానమంత్రి పక్కన ఓ ఏ2 ముద్దాయి తిరగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు.

ప్రత్యేకహోదా కోసం అఖిలపక్ష భేటీ నిర్వహించాలని డిమాండ్ చేసిన పార్టీలే... ఇప్పుడు అఖిలపక్ష సమావేశానికి డుమ్మా కొట్టాయని విమర్శించారు. కేసుల్లో ఏ2 ముద్దాయిగా ఉన్న విజయసాయికి ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత కూడా లేదని అన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

మరోవైపు, చంద్రబాబును చార్లెస్ శోభరాజ్ తో విజయసాయిరెడ్డి పోల్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో, రాజ్యసభలో మోదీ కాళ్లకు విజయసాయి మొక్కారనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. 

More Telugu News