vishnu kumar raju: జాబు కావాలంటే బాబు రావాల‌న్నారు.. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ జాబు వచ్చింది: విష్ణుకుమార్ రాజు ఎద్దేవా

  • అంద‌రి ఇళ్ల‌ల్లో జాబులు నిండిపోయాయి
  • ఈ రాష్ట్రంలో జాబు లేనివారే లేరు
  • ప్ర‌భుత్వం చేసిన దానికంటే చెప్పేది ఎక్కువ‌గా ఉంది
  • ఐటీ రంగ అభివృద్ధికి సీఎం ఎలాంటి చొర‌వ తీసుకోలేదు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమ‌ర్శ‌ల వర్షం కురిపించారు. ఈ రోజు శాస‌న‌స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ... ఎన్నిక‌ల ముందు బాబు వ‌స్తే జాబు వ‌స్తుంద‌ని చెప్పారని, చెప్పిన‌ట్లే ఇప్పుడు అంద‌రి ఇళ్ల‌ల్లో జాబులు నిండిపోయాయని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో జాబు లేని వారే లేరని చుర‌క‌లంటించారు.

రాష్ట్ర‌ ప్ర‌భుత్వం చేసిన దానికంటే చెప్పేది ఎక్కువ‌గా ఉంద‌ని విష్ణుకుమార్‌ రాజు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఐటీ రంగ అభివృద్ధి చేసిన చంద్ర‌బాబు నాయుడు ఇప్పుడు మాత్రం ఐటీ రంగ అభివృద్ధికి ఎలాంటి చొర‌వ తీసుకోవ‌ట్లేద‌ని ఆరోపించారు. వాస్త‌వాల‌ను ఒప్పుకోవాలని, నిజాల‌ను మాత్ర‌మే ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని వ్యాఖ్యానించారు. 

  • Loading...

More Telugu News