Ramcharan: రంగమ్మత్తతో రామ్ చరణ్.. వైరల్ అవుతున్న ఫొటోలు!

  • రాంచరణ్ కు అనసూయ పుట్టినరోజు శుభాకాంక్షలు
  • ఈ ఏడాదంతా బ్లాక్ బస్టర్ గా నిలిచిపోవాలంటూ ఆకాంక్ష
  • రెండు ఫొటోలను షేర్ చేసిన రంగమ్మత్త

రామ్ చరణ్, సమంత, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న 'రంగస్థలం' మూవీపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా పాటలు ఇప్పటికే బాగా పాప్యులర్ అయ్యాయి. మరోవైపు, ఈ చిత్రంలో యాంకర్ అనసూయ కీలక పాత్ర పోషించింది. రంగమ్మత్త క్యారెక్టర్ లో అనసూయ ఫొటోలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా, అనసూయ మరో రెండు ఫొటోలను తన ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్లలలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా రాంచరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ఈ ఏడాదంతా బ్లాక్ బస్టర్ గా నిలిచిపోవాలని ఆకాంక్షించింది.  ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.  
.

More Telugu News