raqjanikanth: రజనీ సరసన కథానాయికగా ఎవరికి ఛాన్స్ దక్కేనో?

  • రజనీ హీరోగా కళానిధి మారన్ మూవీ 
  • దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ 
  • పరిశీలనలో ముగ్గురు కథానాయికల పేర్లు  

ప్రపంచవ్యాప్తంగా రజనీ అభిమానులు అత్యధిక సంఖ్యలో వున్నారు. అందువలన ఆయన సినిమా అంటే అందరి దృష్టి ఆ వైపునే ఉంటుంది. ఆల్రెడీ రజనీ చేసేసిన '2.ఓ' .. 'కాలా' సినిమాలు విడుదలకి ముస్తాబవుతున్నాయి. ఈ సినిమాలు థియేటర్స్ కి వచ్చే రోజు కోసం అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే కళానిధి మారన్ నిర్మాణంలో .. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. భారీ బడ్జెట్ తో నిర్మితం కానున్న ఈ సినిమా కోసం ముగ్గురు కథానాయికల పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ జాబితాలో దీపికా పదుకొనే .. త్రిష .. అంజలి పేర్లు కనిపిస్తున్నాయి. మరి ఈ ముగ్గురిలో రజనీ సరసన ఎవరికి ఛాన్స్  దక్కుతుందో చూడాలి.    

  • Loading...

More Telugu News