Salman Khan: సల్మాన్ సహా నాకు సాయం చేసిన వారందరికీ ధన్యవాదాలు: టీబీతో బాధపడుతున్న హీరోయిన్

  • ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తున్నాను
  • కొన్ని రోజులకు నా కాళ్లపై నేను నిలబడగలనేమో
  • కొన్ని వారాలకు సొంత డబ్బులతో టీ కొనుక్కోగలనేమో
సల్మాన్ ఖాన్‌ సరసన 'వీర్ ఘటీ' సినిమాలో నటించిన పూజా దడ్వాల్ ఇప్పుడు అనారోగ్యం నుంచి కోలుకుంటోంది. ప్రభుత్వాసుపత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రికి మారిన నేపథ్యంలో పూజ దడ్వాల్ స్పందిస్తూ, 'తన వైద్యానికి సాయమందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. ఎట్టకేలకు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తున్నాను, కొన్ని రోజులకు నా కాళ్లపై నేను నిలబడగలనేమో... ఇంకొన్ని వారాల్లో సొంత డబ్బులతో టీ కొనుక్కోగలుగుతానేమో' అని పేర్కొంది.

ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న 'రేసుగుర్రం' సినిమా ఫేం రవికిషన్ ఆమెకు సాయమందించగా, ఈ వార్త ఆనోటా ఈనోట మారి సల్మాన్ కు చేరింది. దీంతో ఆమె గురించి ఆందోళన పడవద్దన్న సల్మాన్.. ఆమె పూర్తిగా కోలుకునేంత వరకు సహాయం అందిస్తానని మాటిచ్చాడు. ఆ వెంటనే ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి మార్పించాడు. వీరితో పాటు ఆమెకు సాయం చేయడానికి మరికొంత మంది దాతలు ముందుకు రావడం విశేషం. 
Salman Khan
pooja dadhwal
ravikishan
actress
ill ness

More Telugu News