srivishnu: చిన్న సినిమానే పెద్ద హిట్ కొట్టేసింది .. అదనంగా 70 థియేటర్లు

  • శ్రీవిష్ణు హీరోగా 'నీదీ నాదీ ఒకే కథ'
  • విడుదలైన ప్రతి చోటున భారీ వసూళ్లు 
  • శ్రీవిష్ణు కెరియర్లో పెద్ద హిట్      

మొదటి నుంచి కూడా శ్రీవిష్ణు వైవిధ్యభరితమైన సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'నీదీ నాదీ ఒకే కథ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ విజయవిహారం చేస్తూ వెళుతోంది. భారీ వసూళ్లను సాధిస్తూ .. శ్రీవిష్ణు ను మరోమెట్టు పైకి ఎక్కించింది.

 చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా, తొలి మూడు రోజుల్లోనే లాభాల బాటలో పడిపోయింది. ఈ సినిమాకి గల ఆదరణను బట్టి అదనంగా 70 థియేటర్లను పెంచారు. ఈ సినిమా కోసం 2.25 కోట్లు ఖర్చు చేయగా, ఇప్పటికే 2.30 కోట్ల లాభాలను రాబట్టింది. శాటిలైట్స్ రైట్స్ ఇంకా అమ్మడం జరగలేదు. వాటికి భారీ రేటు పలకనుందని అంటున్నారు. ఇక ఈ సినిమా వసూళ్లు కూడా మరింతగా పెరగనున్నాయని చెబుతున్నారు. మొత్తానికి శ్రీ విష్ణు ఖాతాలో మరో హిట్ చేరిపోయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది.        

  • Loading...

More Telugu News