Sridevi: షూటింగ్ లో ముభావంగా కనిపిస్తున్న శ్రీదేవి కుమార్తె!

  • జాన్వీ ముఖంలో తల్లిని కోల్పోయిన బాధ
  • ఆ బాధలోనే 'థడక్' షూటింగ్ కు
  • ఓదారుస్తున్న నెటిజన్లు
తల్లిని కోల్పోయిన బాధలో ఉన్న శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, తన తొలి చిత్రం షూటింగ్ లో ముభావంగా కనిపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె అన్యమనస్కంగానే తన సహనటుడు ఈషాన్ ఖట్టర్ తో కలసి 'థడక్' చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది.

మరాఠీలో సూపర్ హిట్ అయిన 'సైరాత్' చిత్రాన్ని హిందీలో శశాంక్ ఖేతన్ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూలైలో విడుదల కానుండగా, చిత్రం షూటింగ్ ప్రస్తుతం కోల్ కతాలో జరుగుతోంది. జాన్వీ ముభావంగా ఉన్న చిత్రాన్ని మీరూ చూడవచ్చు. ఈ ఫొటో చూసిన వారంతా జాన్వీ కపూర్ ను ఓదారుస్తూ ట్వీట్లు పెడుతున్నారు.
Sridevi
Janvi Kapoor
Dhadak
Kolkata

More Telugu News