Telangana: తెలంగాణ ఏజీ ప్రకాశ్ రాజీనామా తరువాత.... ప్రభుత్వం తరపున హరీశ్ సాల్వే రంగ ప్రవేశం!

  • నిన్న అనూహ్యంగా రాజీనామా చేసిన ప్రకాశ్
  • వెంటనే హరీశ్ సాల్వేను పిలిపించిన ప్రభుత్వం
  • కేసు వివరాలు తెలుసుకుంటున్న హరీశ్

తెలంగాణ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్న వేళ, మండలి చైర్మన్ స్వామిగౌడ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ లు దాడికి దిగిన కేసు విచారణను నేడు హైకోర్టు చేపట్టనుండగా, తెలంగాణ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించనున్నారు.

ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న ఆయన, ప్రభుత్వ అధికారుల నుంచి కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కేసులో దాడికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ని నేడు కోర్టుకు అందిస్తామని గతంలో చెప్పిన తెలంగాణ ఏజీ ప్రకాశ్ నిన్న అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న కేసీఆర్ సర్కారు వెంటనే హరీశ్ సాల్వేను రంగంలోకి దించడం గమనార్హం. మధ్యాహ్నం తరువాత కేసు విచారణ హైకోర్టులో జరుగుతుందని సమాచారం.

More Telugu News