Tamannaah: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • వెంకటేశ్ కి జోడీగా తమన్నా 
  • 'ఎన్టీఆర్' బయోపిక్ కి ముహూర్తం 
  • తమిళంలోకి అనువాదమవుతున్న 'రంగస్థలం' 
  • త్రివిక్రమ్ చిత్రానికి మ్యూజిక్ కంపోజిషన్ మొదలు   

*  వెంకటేశ్ సరసన తమన్నా నాయికగా నటించనుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ, వరుణ్ తేజ్ హీరోలుగా ఓ మల్టీ స్టారర్ రూపొందనున్న సంగతి విదితమే. ఇందులో వెంకీ సరసన తమన్నా నటించే అవకాశం వుందని తెలుస్తోంది.  
*  మహానటుడు దివంగత ఎన్టీ రామారావు జీవిత చరిత్రగా తెరకెక్కే 'ఎన్టీఆర్' చిత్రాన్ని ఈ నెల 29న హైదరాబాదులోని రామకృష్ణా స్టూడియోస్ లో ప్రారంభిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో బాలకృష్ణ ముఖ్య పాత్రధారిగా ఈ చిత్రం రూపొందనుంది.
*  రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగస్థలం' చిత్రాన్ని ఈ నెల 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. మరోపక్క ఈ చిత్రం తమిళ అనువాద కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని, ఏప్రిల్ లో గానీ, మేలో గానీ తమిళ వెర్షన్ ని రిలీజ్ చేస్తామని చరణ్ తెలిపాడు.    
*  ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందే చిత్రం షూటింగ్ ఏప్రిల్ 12 నుంచి జరుగుతుంది. కాగా, ఈ చిత్రం కోసం మ్యూజిక్ కంపోజిషన్ ను అప్పుడే మొదలు పెట్టేసినట్టు సంగీత దర్శకుడు తమన్ పేర్కొన్నాడు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.   

More Telugu News