తప్పుడు వార్తలకు పదేళ్ల కారాగారం...! కొత్త చట్టానికి మలేసియా సర్కార్ కసరత్తు
- తప్పుడు వార్తలకు పదేళ్ల జైలు లేదా భారీ జరిమానా విధింపుకు మలేసియా సర్కార్ ప్రతిపాదన
- కొత్త చట్టం తీసుకురావడానికి కసరత్తు
- ఆగస్టులో జరిగే సాధారణ ఎన్నికల్లో గెలుపు కోసమే ప్రధాని రజాక్ ప్రభుత్వం ఇలా చేస్తోందని విపక్షాల విమర్శలు
రాబోయే ఎన్నికల్లో నజీబ్ రజాక్ హయాంలో జరిగిన అవినీతిపై ఎవరూ విమర్శలు చేయకుండా చేయడానికే ఈ చట్టాన్ని తీసుకువస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. ప్రజా భద్రత కోసమే ఈ చట్టాన్ని తీసుకువస్తున్నామని, ఇది భావ ప్రకటనా స్వేచ్ఛకు ఏ మాత్రం భంగం కలిగించదని భరోసా కల్పిస్తుండటం గమనార్హం. మరోవైపు కొత్తగా తీసుకురాబోయే చట్టంలోని నిబంధనలను విదేశాలకు వెళ్లినప్పుడు ఉల్లంఘించినా సరే వారు మలేసియాలో శిక్షను అనుభవించాల్సి ఉంటుంది.