Illeana: ఇలియానా అరుదైన అఛీవ్‌మెంట్....!

  • ఫిజి పర్యాటక రంగానికి ప్రచారకర్తగా నియామకం
  • భారత పర్యాటకులను భారీగా ఆకర్షించడమే లక్ష్యంగా ఎంపిక
  • ఫిజి సొంతిల్లు లాంటిదని 'బర్ఫీ' భామ వెల్లడి

గోవా బ్యూటీ ఇలియానా డి'క్రూజ్ ఓ అరుదైన ఘనతను సాధించింది. ఫిజి పర్యాటక రంగానికి ప్రచారకర్తగా నియమించబడింది. ఈ 'బర్ఫీ' భామకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని భారతదేశం నుంచి పర్యాటకులను భారీ సంఖ్యలో ఆకర్షించే దిశగా ఆ దేశ టూరిజం శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఈ 'రుస్తుం' సుందరి మాట్లాడుతూ..."ఫిజి లాంటి ఓ అందమైన దేశానికి ప్రచారకర్తగా ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. ఫిజి ప్రజలు చూపించే ఆత్మీయత, ప్రేమ, ఆతిథ్యం వల్ల ఆ దేశం నాకు సొంతిల్లులా అనిపిస్తుంది. ఈ అందమైన స్వర్గం గురించి మరిన్ని విషయాలు అన్వేషించడానికి నేనెంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను" అని ఈ 'రైడ్' భామ తెలిపింది.

  • Loading...

More Telugu News