Ramcharan: చిట్టిబాబును దాటేసిన భరత్... ఫస్ట్ సాంగ్ రిపోర్ట్!

  • రెండు గంటల్లోనే మహేష్ సాంగ్ కు 10 లక్షల వ్యూస్
  • రెండో స్థానంలో రామ్ చరణ్ 
  • 'ఎంత సక్కంగున్నావే' పాటకు మూడు గంటల సమయం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గత వారంలో సృష్టించిన రికార్డులను మహేష్ బాబు 'భరత్ అనే నేను' దాటేసింది. కేవలం రెండు గంటల వ్యవధిలోనే 'దిస్ ఈజ్ మీ' అనే పాటను 10 లక్షల మంది యూ ట్యూబ్  లో చూశారు. దీంతో రామ్ చరణ్ 'రంగస్థలం' తొలి సాంగ్ రికార్డు చెరిగిపోయింది. 'ఎంత సంక్కగున్నావే' అంటూ విడుదలైన పాట మూడు గంటల సమయంలో ఈ రికార్డును అందుకుంది. ఆ తరువాత అల్లు అర్జున్ 'నా పేరు శివ' తొలి పాట విడుదల తరువాత 7 గంటల వ్యవధిలో ఈ రికార్డును అందుకుంది. అంతకన్నా ముందు పవన్ కల్యాణ్ సినిమా 'అజ్ఞాతవాసి'లోని బయటికొచ్చి చూస్తే సాంగ్ 8 గంటల వ్యవధిలో 10 లక్షల వ్యూస్ సాధించింది. వీటన్నింటితో పోలిస్తే, మహేష్ సాంగ్ కేవలం రెండు గంటల్లోనే 10 లక్షల మందిని ఆకర్షించడంతో ప్రిన్స్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ సాంగ్ లిరిక్స్ ఇప్పుడు వైరల్.

  • Loading...

More Telugu News