Narendra Modi: మోదీని దూషించినందుకు నటుడు శివాజీపై కేసు నమోదు

  • ప్రధాని నరేంద్ర మోదీని ఇడియట్ అన్న శివాజీ
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
  • కేసు నమోదు చేసిన పోలీసులు
ప్రధాని నరేంద్ర మోదీని ఇడియట్ అని దూషించినందుకు నటుడు శివాజీపై విజయవాడలో పోలీసు కేసు నమోదైంది. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై శివాజీ నిరాధార ఆరోపణలు చేశారని నిన్న బీజేపీ నేతలు సూర్యారావు పేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. శివాజీ మీడియా సమావేశానికి, ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ని బీజేపీ నేతలు తోట శివనాగేశ్వరరావుతో పాటు బండి కాళేశ్వరరావు, మల్లాప్రగడ విజయలక్ష్మి తదితరులు అందించారు. వీటిని పరిశీలించిన పోలీసులు శివాజీకి వ్యతిరేకంగా ప్రాధమిక సాక్ష్యాలు ఉన్నాయని తేల్చి కేసు నమోదు చేశారు.
Narendra Modi
Sivaji
Bjp
Vijayawada

More Telugu News