Bhadrachalam: సర్వాంగ సుందరం మిథిలా ప్రాంగణం!

  • భద్రాచలంలో సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి
  • వేచిచూస్తున్న వేలాది మంది భక్తులు
  • ఉదయం 10.30 గంటల నుంచి కల్యాణం

భద్రాచలం సీతా రాముల కల్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కల్యాణం జరిగే మిథిలా ప్రాంగణం ఇప్పటికే సర్వాంగ సుందరంగా ముస్తాబుకాగా, వేలాది మంది భక్తజనం స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు వేచి చూస్తున్నారు. ఈ ఉదయం 10.30 నుంచి 12.30 గంటల మధ్య సీతారాముల కల్యాణం అభిజిత్ లగ్నంలో జరగనుంది. కల్యాణోత్సవం అనంతరం రాత్రికి చంద్రప్రభ వాహన సేవ, రేపు శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం కన్నులపండువగా జరుగనున్నాయి. మంగళవారం నాడు సదస్యము, హంసవాహన సేవ, 29వ తేదీన తెప్పోత్సవం, దోపు ఉత్సవం, అశ్వవాహన సేవ30న ఊంజల్ సేవ, సింహ వాహనం, ఏప్రిల్ 1న చక్రతీర్థం, శేష వాహన సేవ, ధ్వజావరోహణం ఉంటాయని, ఆపై పుష్పయాగంతో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయని అర్చకులు వెల్లడించారు.

More Telugu News