Guntur District: ఎంపీలందరితో వైఎస్ జగన్ కీలక సమావేశం!

  • సత్తెనపల్లి సమీపంలో ఎంపీలతో జగన్ సమావేశం
  • రాష్ట్రంలో మారుతున్న రాజకీయాలపై చర్చ
  • పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మరికాసేపట్లో పార్టీ ఎంపీలతో కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. గత కొద్ది రోజులుగా ఎన్డీయేపై అవిశ్వాస తీర్మాన నోటీసులను నిత్యమూ స్పీకర్ కు అందిస్తున్నా చర్చ జరగని పరిస్థితులపై ఆయన చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులపై, పార్లమెంట్ లో అనుసరించాల్సిన తాజా వ్యూహాలపైనా ఆయన ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ముప్పాళ్ల గ్రామంలో ఈ భేటీ జరుగుతుందని, హోదా, అవిశ్వాసానికి వివిధ పార్టీల మద్దతు కూడగట్టడం, హోదా డిమాండ్ ను మరింత ఉద్ధృతం చేయడం వంటి విషయాలనూ జగన్ చర్చిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Guntur District
Sattenapalli
Jagan
YSRCP
Special Category Status

More Telugu News