Pawan Kalyan: పవన్ కల్యాణ్ కొంచెం తొందరపడ్డారు : టీడీపీ ఎంపీ మురళీమోహన్

  • పవన్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు
  • ఆ అవసరం ఆయనకు ఎందుకొచ్చింది?
  • పవన్ ని నేనేమీ విమర్శించడం లేదు
  • ఓ ఇంటర్వ్యూలో ఎంపీ మురళీమోహన్
సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన ఆరోపణలపై టీడీపీ ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్ స్పందించారు. ‘ఎన్టీవీ’కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ ఏపీకి మంచి చేయాలని పవన్ కల్యాణ్ మనసులో ఉంది. కాకపోతే, ఆయనకు అంతగా అనుభవం లేకపోవడం వల్ల కానీ, సన్నిహితుల సలహాల వల్ల గానీ కొంచెం తొందరపడ్డారు.

 చంద్రబాబునాయుడు గారు ఉండ బట్టే రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందిందని, అలాంటి నాయకుడు మనకు భవిష్యత్ లో కూడా ఉండాలని ఇంతకుముందు చెప్పిన పవన్ కల్యాణ్, ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం ఆయనకు ఎందుకు వచ్చింది?’ అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఆరోపణలు గుప్పించడాన్ని తొందరపాటు చర్యగా అభివర్ణించిన మురళీమోహన్, పవన్ ని తానేమీ విమర్శించడం లేదని, ఆయన్ని విమర్శిస్తే తమను తాము విమర్శించుకున్నట్టేనని చెప్పడం గమనార్హం.
Pawan Kalyan
Telugudesam
mp murali mohan

More Telugu News