RAILWAY: ప్రయాణికుల భద్రత కోసం రైల్వే కొత్త ప్రయోగం... ప్రమాదాల నివారణకు కొత్త వ్యవస్థ

  • కోచ్ డిఫెక్ట్ మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు
  • దేశవ్యాప్తంగా 65 రైల్వే సెక్షన్లలో అమలుకు శ్రీకారం
  • ప్రయోగాత్మక పరీక్షలో మంచి ఫలితాలు

ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రతే ప్రాధాన్యంగా రైల్వే శాఖ నూతన వ్యవస్థను అమలు చేయనుంది. కోచ్ డిఫెక్ట్ మానిటరింగ్ సిస్టమ్ ను దేశవ్యాప్తంగా 65 రైల్వే సెక్షన్లలో ఏర్పాటు చేస్తోంది. ఇందులో 25 సెక్షన్లు సెంట్రల్ రైల్వే, వెస్టర్న్ రైల్వే పరిధిలో (ప్రధానంగా మహారాష్ట్ర) ఉన్నాయని ఓ అధికారి తెలిపారు. వార్ధా-నాగ్ పూర్, భుసావల్-జల్గోన్, ముంబై-సూరత్, సూరత్-బరోడా సెక్షన్లలో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

ఈ వ్యవస్థ గురించి ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ అరుణ్ అరోరా వివరించారు. ‘‘మైక్రో ఫోన్లు, సెన్సార్లను వ్యాగన్ల మధ్య ఏర్పాటు చేస్తారు. ఇవి శబ్దాలను రికార్డు చేస్తుంటాయి. రైలు వెళుతున్నప్పుడు ఒత్తిడిని కూడా నమోదు చేస్తాయి. అధికారులు ఆన్ లైన్ లో పర్యవేక్షిస్తుంటారు. లక్నో-ఢిల్లీ మార్గంలో దీన్ని ప్రయోగించగా ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం భౌతికంగా వర్క్ షాపుల్లో తనిఖీలు చేస్తుండగా, దాని స్థానంలో ఈ వ్యవస్థను తెస్తున్నాం’’ అని ఆ అధికారి చెప్పారు.

  • Loading...

More Telugu News