mohammed shami: మొహమ్మద్ షమీకి యాక్సిడెంట్.. కారును ఢీకొన్న ట్రక్కు

  • డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ వెళుతుండగా ప్రమాదం
  • షమీకి స్వల్ప గాయాలు
  • ఆసుపత్రికి తరలింపు

టీమిండియా క్రికెటర్ మొహమ్మద్ షమీ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతను ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొంది. ఈ ప్రమాదంలో షమీకి గాయాలయ్యాయి. డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి వెళుతుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. వెంటనే అతడిని డెహ్రాడూన్ లోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తలకు తగిలిన గాయాలకు కుట్లు వేశారు. ప్రస్తుతం షమీ డెహ్రాడూన్ లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఐపీఎల్ కు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు షమీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. డెహ్రాడూన్ లోని అభిమన్యు క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నాడు.  

ఇటీవలి కాలంలో షమీపై అతని భార్య తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. షమీకి అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ ఆమె ఆరోపిస్తున్నారు. గృహ హింస చట్టం కింద షమీపై కేసు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో షమీ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. 

  • Loading...

More Telugu News