Tollywood: ఓ టీవీ ఛానల్ ఎడిటర్ పై కేసు పెట్టిన సినీ పరిశ్రమ!

  • లైవ్ షోలో సినీ పరిశ్రమ గురించి అసభ్యకరంగా మాట్లాడారు
  • వేశ్యలతో పోల్చారు, తక్కువ చేసి మాట్లాడారు
  • మా అధ్యక్షుడు శివాజీరాజా ఆధ్వర్యంలో కేసు
సినీ నటులు హైదరాబాదులో ఉంటూ బానిస బతుకులు బతుకుతున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యే రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదాపై నటులు మాట్లాడటం లేదని... ప్రజలు ఇస్తున్న కోట్లాది రూపాయలతో ఏసీ రూముల్లో కులుకుతున్నారని ఆయన మండిపడ్డారు. దీనికి పోసాని కృష్ణమురళీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే.

తాగాజా సినీ పరిశ్రమ గురించి, అందులో ఉండే వ్యక్తుల గురించి అసభ్యకరంగా మాట్లాడారంటూ ఓ ఛానల్ ఎడిటర్ పై సినీ పరిశ్రమ కేసు పెట్టింది. లైవ్ షోలో సినిమావాళ్ల గురించి నోరు జారారంటూ ఫిర్యాదులో పేర్కొంది. సినిమావాళ్లను వేశ్యలతో పోల్చారని, తక్కువ చేసి మాట్లాడారని కేసు పెట్టారు. మా ప్రెసిడెంట్ శివాజీరాజా అధ్యక్షతన నటీనటులు పోలీసుల చేత కేసు నమోదు చేయించారు.

Tollywood
maa
actors
case
tv channel
editor

More Telugu News