kona venkat: సినీ నటుల రాజకీయ విమర్శలపై కోన వెంకట్ ధ్వజం

  • కొన్ని పొలిటికల్ థియరీస్ ను సినిమాటిక్ గా చెబుతున్నారు
  • లీడర్స్ ను అటాక్ చేయడం మంచి పద్ధతి కాదు
  • ప్రజలు, ప్రజా సమస్యలపై దృష్టి సారించండి
ఇటీవలి కాలంలో సినీ నటులు రాజకీయ విమర్శలు చేయడం ఎక్కువైంది. ఈ చర్యలను సినీ రచయిత కోన వెంకట్ తప్పుబట్టారు. తాజాగా ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ, కొందరు సినీ నటులు కొన్ని పొలిటికల్ థియరీస్ ను సినిమాటిక్ గా చెబుతున్నారని విమర్శించారు. స్టుపిడ్ గా అనిపించే విషయాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నిజమైన రాజకీయ నేతలను అటాక్ చేయడం మంచి పద్ధతి కాదు అని చెప్పారు. విమర్శలు చేస్తున్న సినీ నటుల ఆలోచనా విధానంలో మరింత ప్రాక్టికాలిటీ ఉంటే అభినందించేవాడినని తెలిపారు. ఇలాంటి విమర్శలు మానేసి... ప్రజలు, వారి సమస్యలపై దృష్టి సారించండి బ్రదర్స్ అంటూ హితవు పలికారు.
kona venkat
actors
comments
political
Tollywood

More Telugu News