ashok gajapati raju: తెలుగు ప్రజలని మోసం చేయాలనుకుంటే వారి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది: అశోక్‌ గజపతి రాజు

  • హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టారు
  • ఏపీకి న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని చాలాసార్లు కోరాం
  • కేంద్రం నిర్లక్ష్యం వహించడంతోనే ఎన్డీయే నుంచి వైదొలిగాం
హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టారని, ఏపీకి న్యాయం చేయాలని తాము కేంద్ర ప్రభుత్వాన్ని చాలాసార్లు కోరినప్పటికీ నిర్లక్ష్యం వహించిందని, అందుకే తాము ఎన్డీయే నుంచి వైదొలిగామని టీడీపీ ఎంపీ అశోక్ గజపతి రాజు అన్నారు. ఈ రోజు ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌కి ఇస్తామన్న జాతీయ విద్యాసంస్థలకు కూడా ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని, మరోవైపు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై కూడా కేంద్ర ప్రభుత్వ తీరు బాగోలేదని అన్నారు.

తెలుగు ప్రజలని మోసం చేయాలనుకుంటే వారి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని అశోక్‌ గజపతి రాజు అన్నారు. ఎన్డీయే నుంచి తమ పార్టీ ఏకపక్షంగా బయటకు వచ్చిందంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా లేఖలో పేర్కొనడం సరికాదని విమర్శించారు. 
ashok gajapati raju
Telugudesam
Special Category Status

More Telugu News