Chandrababu: చంద్రబాబు వెన్నుపోటు గురించి చాలానే మాట్లాడగలం : ఎమ్మెల్సీ మాధవ్

  • టీడీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారు
  • పార్లమెంట్ సభ్యుడెవరైనా పీఎంఓకు వెళ్లొచ్చు
  • ఈ విషయం చంద్రబాబు గమనించాలి 
టీడీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని, తాము తలచుకుంటే చంద్రబాబు వెన్నుపోటు గురించి చాలానే మాట్లాడగలమని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ)కు వెళ్లడంపై చంద్రబాబు చేసిన విమర్శల నేపథ్యంలో మాధవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

రాజ్యసభ, లోక్ సభ సభ్యుడు ఎవరైనా ప్రధాన మంత్రి కార్యాలయానికి వెళ్లొచ్చని, ఈ విషయం చంద్రబాబు గమనించాలని అన్నారు. ఏపీ అభివృద్ధే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ఆదుకుందని, ఏపీకి ఇప్పటివరకు ఏం చేశామో అమిత్ షా సవివరంగా వివరించారని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం తామెప్పుడూ పాకులాడలేదని, ఇంతవరకూ నిధుల వినియోగానికి సంబంధించి వివరాలు ఇవ్వలేదని మాధవ్ విమర్శించారు.
Chandrababu
BJP
mlc madhav

More Telugu News