ప్రపంచవ్యాప్తంగా 'ఎమ్మెల్యే' మొదటిరోజు వసూళ్లు
- ఆకట్టుకున్న కల్యాణ్ రామ్ లుక్
- అలరించిన కాజల్ గ్లామర్
- ఆసక్తిని రేపిన కథా కథనాలు
ఇలా తెలుగు రాష్ట్రాల్లోను .. ఇతర ప్రాంతాల్లోను కలుపుకుని ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలిరోజున 5.20 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. కల్యాణ్ రామ్ న్యూ లుక్ తో హ్యాండ్సమ్ గా కనిపించడం .. కాజల్ గ్లామర్ మంత్రం ఎక్కువగా పనిచేయడం .. ఆసక్తికరమైన మలుపులతో కూడిన కథాకథనాలు ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు తెచ్చిపెట్టాయని అంటున్నారు. ఈ వీకెండ్ లో వసూళ్లు మరింతగా పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.