Deepika Padukone: పెళ్లి షాపింగ్ మొదలు పెట్టిన దీపికా పదుకునే

  • తల్లి, చెల్లితో కలసి దీపిక షాపింగ్
  • బెంగళూరులో పలు జువెలరీ షాప్స్ లో సందడి
  • పెళ్లి ముంబైలో జరిగే అవకాశం
బాలీవుడ్ లో మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. ప్రేమజంట దీపికా పదుకునే, రణవీర్ సింగ్ ల పెళ్లికి రంగం సిద్ధమవుతోంది. దీనికి దీపిక చేస్తున్న షాపింగే నిదర్శనం. బెంగుళూరులో తన తల్లి, చెల్లితో కలసి దీపిక షాపింగ్ లో బిజీగా ఉంది. వీరు ముగ్గురు కలసి నగరంలోని పలు జువెలరీ షాపులు కలియదిరిగారు.

జనవరి 5వ తేదీన దీపిక పుట్టిన రోజు సందర్భంగా ప్రేమికులిద్దరూ ఉంగరాలు మార్చుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఇటీవలే దీపిక కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి ముంబై వెళ్లి రణవీర్ కుటుంబసభ్యులతో అన్ని విషయాలు మాట్లాడారని... వెడ్డింగ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారని చెబుతున్నారు. ఈ సమావేశం తర్వాత ఇరు కుటుంబాలు ముంబై వర్లీలోని ఫోర్ సీజన్స్ లో డిన్నర్ చేస్తూ కనిపించారు. అయతే, ఈ పెళ్లి ముంబైలోనే జరగాలని రణవీర్ కుటుంబం కోరినట్టు తెలుస్తోంది. 
Deepika Padukone
ranveer singh
marriage
shopping
Bollywood

More Telugu News