Mahesh Babu: 'భరత్ అనే నేను' నుంచి ఫస్టు సింగిల్ వచ్చేస్తోంది

  • ముగింపు దశలో 'భరత్ అనే నేను'
  • ఏప్రిల్ 7న వైజాగ్ లో ఆడియో వేడుక
  • 20వ తేదీన సినిమా రిలీజ్        
కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' రూపొందుతోంది. ముఖ్యమంత్రిగా మహేశ్ బాబు నటిస్తోన్న ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ కి .. టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. గతంలో కంటే ఈ సినిమాలో మహేశ్ బాబు .. మరింత హాండ్సమ్ గా వున్నాడని అంటున్నారు.

ఈ నేపథ్యంలో 'శ్రీరామ నవమి' పండుగను పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేస్తున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ఫస్టు సింగిల్ ను వదలనున్నారు. ఆడియో వేడుకను వచ్చేనెల 7వ తేదీన వైజాగ్ లో భారీ స్థాయిలో నిర్వహించడానికి ప్లాన్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. ఏప్రిల్ 20వ తేదీన విడుదలవుతోన్న ఈ సినిమాలో, కథానాయికగా కైరా అద్వాని కనిపించనుంది.
Mahesh Babu
kiaraadvani

More Telugu News